Sycnews Guntur

Sycnews Guntur Sycnews Guntur
0 80.43654

no images yet

SHARE WITH OTHERS
SITE SENSE TAGS
See new updates

Sycnews Guntur

Latest Updates

రాయలసీమలోని నాలుగు జిల్లాలు తీవ్రమైన కరువుతో అల్లాడిపోతుంటే పట్టించుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి జపం చేస్తూ నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్టు వ్యవహరిస్తున్నారని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖరరెడ్డి ధ్వజమెత్తారు. విజయవాడ ఐలాపురం హోటల్-లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తీవ్ర కరువు కారణంగా సీమ రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుండగా యువకులు పొరుగు ప్రాంతాలకు వలస పోతున్నారని అయినా సీఎం చంద్రబాబు నెత్తిన అమరావతి దెయ్యం పట్టినట్టుగానే వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ కేసీఆర్-కు భయపడి చంద్రబాబు విజయవాడ వచ్చేశారని బైరెడ్డి ఆరోపించారు. 13 జిల్లాల చిన్న రాష్ట్రానికి ఏకంగా లక్షల ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేపట్టడం చిన్న పాపకు పెద్ద గౌను వేసినట్టు ఉందని ఎద్దేవా చేశారు. కేవలం 500 ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేపట్టవచ్చని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భూ సమీకరణ పద్ధతిలో లక్షల ఎకరాల సేకరించడం వెనుక అసలు కారణం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి దండుకోవడానికేనని ఆరోపించారు. రాయలసీమకు అడుగడుగునా అన్యాయం చేస్తున్న ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రాయలసీమ రాష్ట్ర ఉద్యమానికి కారణం అవుతోందని నిర్లక్ష్యం చేసి తమకు తామే విడిపోయే పరిస్థితులు కల్పిస్తోందని ఆయన విమర్శించారు. రాయల సీమకు నీరివ్వడంలో ఘోరంగా విఫలమైన ప్రభుత్వం శ్రీశైలం డెడ్ స్టోరేజీ నుంచి కూడా మంచినీటి అవసరాల పేరుతో నీరు విడుదల చేస్తోందని ధ్వజమెత్తారు. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల రాయలసీమకు ఎటువంటి ప్రయోజనమూ లేదన్నారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమకు రావాల్సిన రాజధానిని అమరావతికి మార్చారని సాగునీరు ఇవ్వకుండా దగా చేస్తున్నారని కరువు ప్రాంతాల్లో వలసల నివారణకు చర్యలు తీసుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు వివరించేందుకు త్వరలోనే సీమ జిల్లాల్లో యాత్ర చేపడతామని రాజశేఖరరెడ్డి ప్రకటించారు. సీమ ప్రాంతానికే చెందిన సీఎం నంబర్ గేమ్-లో పడి కోస్తా జిల్లాల్లో సీట్ల కోసం సీమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. సీమకు చెందిన పెద్దాయన కేఈ కృష్ణమూర్తి తన పదవికి రాజీనామా చేసి రాయలసీమ మేలు కోసం ఉద్యమంలో కలిసిరావాలని బైరెడ్డి కోరారు.

   Over a month ago
SEND

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం పర్యటిస్తున్నారు. నెల్లూరు పట్టణంలో ఉదయాన్నే ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో పారిశుధ్య లోపం విషయంలో అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల అలసత్వం వల్ల డెంగీ వ్యాధి ప్రబలుతోందని సీఎం వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు బారా షహీద్ దర్గాను సందర్శించారు. ఈ దర్గాలో కొద్ది రోజుల క్రితమే రొట్టెల పండుగను ఘనంగా నిర్వహించారు. స్వర్ణాల చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆ తరువాత వెంగళరావునగర్-లో కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలు కుటుంబాల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మంచినీరు సరిగా సరఫరా కావడం లేదని స్థానికులు సీఎంకు ఫిర్యాదు చేశారు. దీనిపై నగర పాలక సంస్థ అధికారులపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రామ్-నగర్-లోని పేద కుటుంబాలను సీఎం పరామర్శించారు. ఒక కుటుంబంలోని పిల్లలు బడికి వెళ్ళకపోవడంపై ఆరా తీశారు. ఆర్థిక స్థితి బాగోలేని ఆ కుటుంబానికి ఆయన రూ.25 వేలు సహాయం ప్రకటించారు. మరో కుటుంబానికి రుణం మంజూరు చేయాలని కలెక్టర్-ను సీఎం చంద్రబాబు ఆదేశించారు. నెల్లూరులో శుక్రవారం జరిగిన ఏపీ కేబినెట్ మంత్రులు నారాయణ కుమార్తె- గంటా శ్రీనివాసరావు కుమారుడి పెళ్ళికి హాజరైన చంద్రబాబు రాత్రికి అక్కడే బస చేశారు. నెల్లూరు పోలీసు కవాతు మైదానం నుంచి బయలుదేరిన చంద్రబాబు నగరంలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. సీఎం వెంట జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

   Over a month ago
SEND

తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం దిండి రిసార్టుల సమీపంలో శనివారం మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. తమ పంట పొలాల నుంచి గెయిల్ పైప్ లైన్ వేయొద్దంటూ రైతులు చేపట్టిన ఆందోళన రెండో రోజు కూడా కొనసాగుతోంది. దిండిలో గెయిల్ గ్యాస్ పైపులైను నిర్మాణ పనుల దృష్ట్యా శుక్రవారం విధించిన 144 సెక్షన్ శనివారం కూడా కొనసాగుతోంది. నగరం గ్యాస్ పైపులైన్ పేలుడు దుర్ఘటన తర్వాత గ్యాస్ సరఫరాలో ఆటంకం ఏర్పడింది. ఈ నేపథ్యంలో గ్యాస్ పైపులైనును తిరిగి నిర్మించాలని కేంద్రం ఆదేశించింది. అయితే భారీ పేలుడు దుర్ఘటన అనుభవంతో దిండిలో పైపులైను నిర్మాణ పనులకు స్థానిక రైతులు అభ్యంతరం చెప్పారు. దీంతో ఐదు నెలలుగా పైపులైను పనులు నిలిచిపోయాయి. తాజాగా కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలతో భారీగా పోలీసులను మోహరించి పనులను చేపట్టారు. దీంతో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ఉన్న దిండి రిసార్టుల సమీపంలో ఆందోళన%2C ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. గోదావరి తీరం వెంట ఉండే ఈ రిసార్టుల వద్దకు వారాంతాల్లో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది పర్యాటకులు వస్తుంటారు

   Over a month ago
SEND

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా ఉండవల్లి పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసుకున్న నివాసం ఆ పంచాయతీకి ఆర్థిక భారాన్ని మోపుతోంది. అసలే అంతంత మాత్రం ఆదాయం కలిగిన ఆ పంచాయతీ సీఎం కారణంగా నెలకు రూ. 1.11 లక్షల విద్యుత్తు చార్జీలను చెల్లించాల్సి వస్తోంది. ప్రకాశం బ్యారేజీ నుంచి సీఎం నివాసం వరకు ఏర్పాటు చేసిన 215 వీధిలైట్లకు సెప్టెంబర్ కరెంటు బిల్లు రూ.1 10 905 వచ్చింది. 20 వేల జనాభా కలిగిన ఉండవల్లి పంచాయతీకి సాలీనా రూ.కోటి వరకు ఆదాయం లభిస్తోంది. ఇంటిపన్ను నీటి పన్నుల రూపంతో రూ.24 లక్షలు ఇసుక రీచ్ల నుంచి సీనరేజి రూపంలో రూ.70 లక్షల ఆదాయం ఉండవల్లికి లభిస్తోంది. పారిశుధ్యం ఇతర పనులు చేస్తున్న తాత్కాలిక ఉద్యోగులకు నెలకు రూ.2.40 లక్షల వేతనాలు చెల్లిస్తోంది. మిగిలిన నిధులను మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగిస్తున్నారు. ముఖ్యమంత్రి ఉండవల్లి పంచాయతీ పరిధిలోని కృష్ణానది కరకట్ట పక్కనే నివాసం ఏర్పాటు చేసుకోవడంతో భద్రత కారణాల రీత్యా ప్రకాశం బ్యారేజి నుంచి నివాసం వరకు వీధిలైట్లను ఏర్పాటు చేశారు. రాత్రి సమయాల్లో ఈ లైట్లన్నింటినీ వినియోగించడంతో సెప్టెంబర్-లో కరెంటు బిల్లు తడిసి మోపెడైం

   Over a month ago
SEND

రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలంటూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పెరిగిన ధరలతో సామాన్యుడి జీవితం చిన్నాభిన్నం అవుతుందంటూ ప్రభుత్వం పై మండిపడ్డారు. ధరల తగ్గింపును కోరుతూ ప్రకాశం జిల్లా వేటపాలేం మండలం జాండ్రపేట నుండి చీరాల వరకు ధరల భూతాన్ని అదుపు చేయాలంటూ పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రకు కాంగ్రెస్ సమాజ్ వాదీ పార్టీలు మద్దతు తెలిపాయి. కందిపప్పు ఉల్లిపాయలు మినపప్పు వేరుశెనగపప్పులు సామాన్యులు కొనుక్కుని వంటచేసుకునే పరిస్టితి లేదని సిపిఐ నాయకులు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించకపోతే సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉధ్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం చీరాల ఎమ్మార్వో అఫిసు ఎదుట దర్నా నిర్వహించి ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేసారు.

   Over a month ago
SEND

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం నిరాశపరచిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు పేర్కొన్నారు. అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాఘవులు టెన్ టివితో మాట్లాడారు. శంకుస్థాపన ఆర్భటంగా చేసినా ప్రధాని మోడీ ప్రసంగం ప్రజలను నిరాశపరిచిందన్నారు. బాబు..మోడీ వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమి లేదన్నారు. హోదా..ప్యాకేజీల గురించి ఏమీ లేవని, ముఖ్యమంత్రి, ప్రధాని ప్రసంగాలు చప్పగా సాగాయని విమర్శించారు. రాష్ట్రానికి వరాలు ఇస్తారని..కేంద్రం సహాయం చేస్తుందని..ప్రత్యేకహోదా..ప్యాకేజీ వస్తుందని ఆశించిన ప్రజలకు అడియాసే ఎదురయైందన్నారు. ప్రత్యేక హోదాపై కానీ..ప్రత్యేక ప్యాకేజీపై కానీ మోడీ మాట్లాడకపోవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. విభజన చట్టంలో ఏమీ చెప్పలేదని, పార్లమెంట్ సమావేశాల్లో నేతల ప్రసంగాల్లో పలు అంశాలు పేర్కొన్నారని తెలిపారు. నేతలు పబ్బం గడుపుకోవడానికే మాటలు చెబుతున్నారని రాఘవులు విమర్శించారు.

   Over a month ago
SEND

అమరావతి శంకుస్థాపనకు జనసేన అధినేత, సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డుమ్మా కొట్టారు. పైకి షూటింగ్ లో బిజీ అని చెబుతున్నప్పటికీ లోలోపల అసంతృప్తి సెగలతోనే హాజరు కాలేదనే వార్తలు షికారు చేస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును స్వయంగా ఇంటికి వెళ్లి ఆహ్వానించిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. పవన్ కళ్యాణ్‌ను మాత్రం స్వయంగా ఆహ్వానించలేదు. ఈ విషయాన్ని పవన్‌ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

మంత్రులు స్వయంగా పిలిచినా..

శంకుస్థాపన మహోత్సవానికి ఏపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్సీ టీడీ జనార్దన్‌లు సర్ధార్ గబ్బర్ సింగ్ షూటింగ్ స్పాట్ కు వచ్చి మరీ ఆహ్వానించారు. ఆహ్వాన పత్రిక అందుకున్న వెంటనే మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను శంకుస్థాపనకు వస్తానో? లేదో అని అప్పుడే అనుమానంగానే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కానీ సీఎం చంద్రబాబు పవన్‌ కు ఫోన్‌ చేసి మరీ అమరావతికి రమ్మన్నారు.
బాబు స్వయంగా పిలువలేదనేనా..?
అయితే అమరావతి శంకుస్థాపనకు చంద్రబాబు స్వయంగా పిలవకపోవడంపై పవన్ అభిమానులు, జనసేన మండిపడుతోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ నిమిత్తం గుజరాత్ రాష్ట్రంలో ఉన్నారు. పొరుగు రాష్ట్రం సీఎం కేసీఆర్‌ బిజీ షెడ్యూల్‌లోనూ వీలు చూసుకొని మరీ హాజరైన సందర్భంలో పవన్‌ హాజరు కాలేకపోవడం నిజంగా సాధ్యపడలేదా అనే అంశం గుసగుసలాడుతోంది.

కోల్డ్ వార్..

సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టిడిపి - బిజెపి కూటమి తరఫున ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చాక.. పవన్ పవన్ కళ్యాణ్ కూడా తమ గెలుపుకు కారణమని పలువురు టిడిపి నేతలు ఆయనను ప్రశంసించారు. అయితే రాజధాని భూముల విషయంలోనూ పవన్‌కు, టీడీపీకి మధ్య కోల్డ్‌ వార్‌ నడిచింది. రాజధాని రైతుల పక్షాన పోరాటం కూడా చేస్తానంటూ పవన్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు పైన పవన్ కళ్యాణ్ అలకవహించారా? లేదా రాజధాని భూముల స్వాధీనం విషయంలో అసంతృప్తితో ఉన్నారా అనే చర్చ కూడా సాగుతోంది.

   Over a month ago
SEND

జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం హన్‌మాన్‌గూడెంలో దారుణం చోటు చేసుకుంది. రాంబాబు సుమలత దంపతులు తమ ఇద్దరు కూతుళ్లతో జీవనం సాగిస్తున్నారు. కాగా అదే గ్రామానికిచెందిన వడ్లపూడి బాలకృష్ణ సుమలతపై కన్నేశాడు.. ఫుల్లుగా మద్యం సేవించి రాంబాబు ఇంట్లోకి చొరబడ్డాడు. అడ్డొచ్చిన రాంబాబు తలపై రాడ్డుతోమోది సుమలతను బలాత్కారం చేసేందుకు ప్రయత్నించాడు. అలాగే అడ్డొచ్చిన ఇద్దరు కూతుళ్లతో బాలకృష్ణ అసభ్యంగా ప్రవర్తించాడు. వాళ్లు కేకలు వేయడంతో ఆ ఇంటికి నిప్పంటించి అక్కడినుంచి పారిపోయాడు. ఈ ఘటనలో ముగ్గురు కుటుంబసభ్యులు గాయపడ్డారు. వీరికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. రాంబాబు, సుమలత పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుని కోసం గాలిస్తున్నారు.

   Over a month ago
SEND